బెంగ‌ళూరులో టెకీ అదృశ్యం

0

ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా కారు అమ్మేందుకు యత్నించిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్నాకు చెందిన కుమార్‌ అజితబ్‌(30) బెంగళూరులోని ఓ బ్రిటీష్‌ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన కారును చూసిన ఓ వ్యక్తి డిసెంబర్‌ 18న కుమార్‌కు ఫోన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సాయంత్రం 6.30 గంటల సమయంలో కుమార్‌ కారులో బయటకు వెళ్లాడన్నారు. చాలాసేపయినా కుమార్‌ జాడలేకపోవడంతో అతని స్నేహితులు కాల్‌ చేయగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసినట్లు తేలిందన్నారు. దీంతో కంగారుపడ్డ వారు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారన్నారు. కుమార్‌ అదృశ్యంపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని ఫోన్‌ లొకేషన్‌ చివరిసారి ఇక్కడి వైట్‌ఫీల్డ్‌లోని గున్జుర్‌లో ఉన్నట్లు చూపించిందన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: