పాక్‌లో విరాట్, అనుష్క‌ హ‌నీమూన్

0

విరాట్‌ కొహ్లీ – అనుష్క శర్మల వివాహం తర్వాత ఇరువురి ఫ్యాన్స్‌ ఆనందం మరింత పెరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్‌లో ఉన్న ఓ ఫోటోను హనీమూన్‌ డైరీస్‌ పేరిట అనుష్క సోషల్‌మీడియా షేర్‌ చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ అభిమాని అనుష్క షేర్‌ చేసిన ఫొటోను ఫొటోషాప్‌ చేశాడు. విరుష్కలు హనీమూన్‌కు పాకిస్తాన్‌కు వచ్చారంటూ సోషల్‌మీడియాలో ఎడిటెడ్‌ ఫొటోను పెట్టాడు. క్షణాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఫాతిమా జిన్నా మెడికల్‌ యూనివర్సిటీకి ఫైనల్‌ ఇయర్‌ మెడికల్‌ విద్యార్థుల ఆహ్వానం మేరకు విరుష్కలు విచ్చేశారని తన పోస్టులో పేర్కొన్నాడు. అంతేకాదు విరుష్క జంట స్థానికంగా దొరికే ఆహారాన్ని కూడా రుచి చూసి, అద్భుతః అని కితాబిచ్చిందని కూడా రాసుకొచ్చాడు. ఈ నెల 21వ తేదీన న్యూఢిల్లీలో, 26వ తేదీన ముంబైలో విరుష్కలు రిసెప్షన్‌ ఇస్తున్న విషయం తెలిసిందే.

Share.

Leave A Reply

%d bloggers like this: