500 కి.మీల‌కు చేరిన‌ వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌

0

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర 500 కిలోమీట‌ర్లు పూర్త‌యింది. 40వ రోజు ప్రజాసంకల్పయాత్రను బుధ‌వారం ఉద‌యం అనంత‌పురం జిల్లా వెంకటాపురం క్రాస్‌ రోడ్డు నుంచి చేపట్టారు. ఈ పాద‌యాత్ర‌లో ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తూ సాగుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏవిధంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారో వివ‌రిస్తున్నారు. నిరుద్యోగ భృతి, ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం విష‌యాల్లో జ‌రుగుతున్న అన్యాయాన్ని తెలియ‌జేస్తూ ముందుకు వెళుతున్నారు. ప్ర‌జ‌లు ఆయ‌న నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. వెంక‌టాపురం నుంచి చిలకలగడ్డపల్లి కొత్తురు, నాయనవారిపల్లి క్రాస్‌, బాపనకుంట, నీరాలవంకతండా, రెడ్డిపల్లి, ఆర్‌.రాంపురం, కమ్మవారిపల్లి మీదగా నల్లసింగయ్యగారిపల్లి, నల్లమడ వరకూ పాదయాత్ర కొనసాగనుంది. నల్లమడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడతారు. ఇప్పటివరకూ ఆయన 551.4 కిలోమీటర్లు నడిచారు.

Share.

Leave A Reply

%d bloggers like this: