వైఎస్‌.జ‌గ‌న్ ఆన్ 644 కిలోమీట‌ర్స్‌

0

ప్రజాసంకల్పయాత్ర నేటికి 47వ రోజుకి చేరుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇక నేడు ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యంలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, తంబళ్లపల్లి, బదలవాండ్లపల్లి మీదుగా రామిగానివారిపల్లి వరకు యాత్ర కొనసాగనుంది. కాగా పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్‌ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు.

Share.

Leave A Reply

%d bloggers like this: