టాప్ 2 లోకి కోహ్లీ

0

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో విశేషంగా రాణించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. లంకేయులతో సిరీస్‌లో 610 పరుగులు సాధించిన కోహ్లి.. తాజాగా విడుదల చేసిన బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-2కు చేరాడు. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లి ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకపై రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సహా 610 పరుగులు చేసిన కోహ్లి.. 893 పాయింట్లతో స్మిత్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కోల్‌కతా టెస్టు ఆరంభానికి ముందు ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానంలో ఉన్న కోహ్లి.. లంకపై రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో టాప్-5లోకి అడుగు పెట్టాడు.వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించడంతో కోహ్లి తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్ ఖాతాలో 893 పాయింట్లు ఉండగా, ఆసీస్ కెప్టెన్ స్మిత్ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోయ్ రూట్ 879 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో సిరీస్ ఆరంభ సమయంలో రెండో స్థానంలో ఉన్న పుజారా 865 పాయింట్లతో నాలుగోస్థానానికి పడిపోయాడు డిసెంబర్లో ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-3 బ్యాట్స్‌మెన్‌గా స్మిత్, కోహ్లి, రూట్‌నే నిలవడం విశేషం. యాషెస్ సిరీస్‌లో ఆసీస్, ఇంగ్లాండ్ తలపడుతున్న నేపథ్యంలో రూట్ మెరుగ్గా రాణిస్తే కోహ్లిని వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకునే వీలుంది.బౌలింగ్ విభాగానికి వస్తే.. ఆసీస్ గడ్డ మీద తొలిసారి ఐదు వికెట్ల సాధించిన ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 894 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబడ రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా మూడోస్థానంలో, అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. షమీ ఒక స్థానం కోల్పోయి 19వ స్థానంలో నిలిచాడు.ఈ సిరీస్‌కు ముందు ఆరో స్థానంలో ఉన్న కోహ్లి ఒకేసారి నాలుగు పాయింట్లను మెరుగుపరుచుకుని రెండో స్థానానికి ఎగబాకాడు.నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టుల్లో డబుల్‌ సెంచరీలతో మెరిసిన కోహ్లి 893 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అటు వన్డేల్లో, ఇటు టీ 20ల్లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న కోహ్లి.. టెస్టుల్లో నంబర్‌ వన్‌గా నిలవడానికి అడుగుదూరంలో ఉన్నాడు. ప్రస్తుతం టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 938 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ జో రూట్‌ 879 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, చతేశ్వర పుజారా 873 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: